Welcome Guest
Register

శాకాహారం ఎందుకు తీసుకోవాలంటే...

1) శాకాహారంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కూరగాయల్లో, ధాన్యాల్లో లభ్యమయ్యే కొవ్వు శరీరానికి అవసరమైన స్థాయిలోనే ఉంటుంది. శాకాహారులకు మంసాహారులకంటే గుండె జబ్బులు 24 శాతం తక్కువ. మధుమేహం ఉన్నవాళ్లు మాంసాహారం తింటే గుండెకు 50 శాతం రిస్కు పెరుగుతుందని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధం చెప్పింది.

2) శాకాహారంతో క్యాన్సర్‌ ప్రమాదం తగ్గుతుంది. వండిన మాంసాహారంలో హెటేరో సైక్లిక్‌ అమైన్స్‌, పోలిసైక్లిక్‌ అరోమాటిక్‌ హైడ్రోకార్బన్స్‌ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ రిస్కును పెంచుతాయి. మాంసాహారంలోని కొవ్వు పదార్థాల వల్ల హార్మోన్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. అది హార్మోన్‌ సంబంధిత (బ్రెస్ట్‌, ప్రోస్టేట్‌) క్యాన్సర్లకు దారి తీస్తుంది. ఫైబర్‌ లేక పోవడం మాంసాహారంలో పెద్ద మైనస్‌. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చాక శాకాహారానికి మారడం వల్ల తనకు జరిగున మేలు గురించి రూత్‌ హైడ్రిచ్‌ 'రేస్‌ ఆఫ్‌ లైఫ్‌' అనే పుస్తకంలో రాశారు.

3) మాంసాహారుల కంటే శాకాహారులు స్లిమ్‌ గా ఉంటారట ! వీరిలో స్థూలకాయం 0-6 శాతానికి మించదు. ఒబెసిటీని తగ్గించుకోవడానికి రెండే మార్గాలున్నాయి. అందులో ఒకటి శాకాహారం.

4) ఆక్సఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధనలో శాకాహారంతో ముసలితనం ఆలస్యమవుతుందని వెల్లడైంది. అందులోని పీచు పదార్థాలు జీర్ణ క్రియ బాగా జరిగేలా చేయడం వల్ల శరీరంలో టాక్సిన్లు త్వరగా బయటకు పోతాయి. మొక్కల ద్వారా పెరిగే ఆహారంలో ఫైటో న్యూట్రియంట్లు, యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరెల్స్‌ రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. దాంతో వయసు ప్రభావం త్వరగా కనిపించదు.

5) జంతువుల్లో ఉండే కొన్ని హానికర పదార్ధాలు మనలోని మేలుచేసే బ్యాక్టీరియాను కూడా చంపుతాయి.

6) ఐక్యరాజ్య సమితి 2006 నివేదిక ప్రకారం మాంసాహార ఉత్పత్తి వల్ల ఏర్పడే కాలుష్యం ప్రపంచ వాహన కాలుష్యంతో సమానం. పదిమంది ఒక్కరోజు తినే మాంసాహారం ఉత్పత్తి చేసే భూమిలో అంతే సమయంలో ఆ పదిమందికి పదిహేను రోజుల ఆహారం ఉత్పత్తి చేయొచ్చు. అంటే శాకాహారం మనకే కాదు, ప్రకృతికీ మేలన్నమాట !

7) మనిషి శరీర నిర్మాణం శాకాహారం తీసుకోవడానికి మాత్రమే అనువైనది. సమతలంగా ఉండే మనిషి పళ్ళు మాంసం సమలడం కంటే ధ్యానం, కూరగాయలు సమలడానికే ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. మనిషి చేతులు, మొక్కలు, పళ్ళ సేకరణకు మాత్రమే అనువుగా సృష్టించబడ్డాయి. అంటే ఆయుధం లేకుండా మనం మాంసం సేకరించలేం. సృష్టిలో మంసహరులైన పులి, సింహం వంటి వాటికి మాత్రమే వాటి ముందరి కాళ్ళు అలా సృష్టించబడ్డాయి. మనిషి లాలాజలంలో స్రవించే ఆల్ఫా అమిలేజ్‌ కార్బోహైడ్రేట్లను చక్కగా జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడింది. ఇది మాంసాహార జీవుల్లో ఉండదు.

8) ప్రపంచంలో ఆహార కొరత కారణంగా రోజుకు 40 వేల మంది చనిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం మాంసాహార ఉత్పత్తి. ప్రతి ఒక్కరూ శాకాహారం తీసుకుంటే ప్రపంచ జనాభాకు సరిపోయేటంత ఆహార ధ్యానాన్ని సులువుగా ఉత్పత్తి చేయవచ్చు.

- సాక్షి దిన పత్రిక, తేది : జూన్ 5, 2011, ఆదివారం ఫన్ డే బుక్, 14వ పేజీలో ప్రచురితమైన లోక కళ్యాణ కారకమైన సత్యాలు

" వీగనిజం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే డా. టి. కొలిన్ కాంప్బెల్ గారు రచించిన " The China Study" మరియు అయిన ఇతర రచనలను చదవండి.
వీగన్ ప్రొడక్ట్స్ కోసం, 9492347276 కి కాల్ చేయండి. ఈ క్రింది వెబ్సైట్ ని విజిట్ చేయండి.
www.sanavegan.guru

సదా... మీకు మంచి జరుగు గాక !

M T V