దేవుళ్ళు బలి అడగరు !
దైవం అంటే ఏమిటి ?
మానవులకు, సర్వ జీవ కోటికి మాతా, పిత, దైవం.?
దేవతను తల్లి అంటారు. దేవుడిని తండ్రి అని అంటారు.?
మరి తల్లిదండ్రులు ఎక్కడైనా తమ సంతానాన్ని బాలి కోరుతారా??!!?
ఉదాహరణకు మీరు మీ పిల్లల బలి కోరుతారా??!!
ఉదాహరణకు అని నేను అన్నందుకే నా మీద కోపం వస్తుంది. కేవలం ఉదాహరణ మాత్రం. సాధారణ మానవులే తమ పిల్లల సంక్షేమాన్ని కోరుతారు. అలాంటిది దేవతలు లేక దేవుళ్ళు తమ పిల్లలైన జంతువులను బలి కోరుతారా?!?!
కొత్త ఇళ్ళు లేక భవనాలు నిర్మించి అందులో నివసించబోయే ముందు బలులు ఇస్తుంటారు. నూతన గృహం అంటే ఏమిటి ? మన జీవితానికి ఆధారం, ఆశ్రయం. అలాంటి గృహ ప్రవేశానికి ముందు బలి ఇవ్వడం అని అంటే ఒక ప్రాణిని హత్య చేస్తున్నట్టే. బలి పేరిట హత్య చేయబడిన ఆ ప్రాణి యొక్క "ఉసురు" ఆ ఇంటికి లేదా భవనానికి లేదా ఆ కాంప్లెక్స్ కు చుట్టుకుంటుంది. ఇక ఆ ఇంటి యజమానులు మరియు ఆ ఇంట్లో నివాసం ఉండబోయే వారు ఆ కర్మను అనుభవించాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు శాకాహారులైతే (వీగన్లయితే) ఏమీ కాదు.
దుకాణాలు లేక ఫ్యాక్టరీలు లేక సినిమా హాళ్ళు లేక ఇతర నిర్మాణాలు చేసి ప్రారంభానికి ముందు "బలి" ఇస్తుంటారు. ఇది ఎంత అసమంజసం ! ఒక ప్రాణి నిండు జీవితాన్ని "బలి" ఇవ్వడం అనేది "హత్య గుణాన్ని " ప్రకటిస్తుంది. కనికరం లేని గుణాన్ని, దయ లేని గుణాన్ని, జంతుకోటి జీవితాలు అసలు జీవితాలే కాదనే నిర్లక్ష్యపు గుణాన్ని ప్రకటిస్తుంది. బలులు ఇచ్చేవారు, అందుకు సహకరించిన వారు తాము కలిగి ఉన్న గుణాలచే, తాము కూడా బలి అవుతారు. అంతకంతా అనుభవిస్తారు. మనం మనుషులం, రాక్షసులం కాదు. మనది మానవ జాతి, రాక్షస జాతి కాదు.
పండుగ రోజుల్లో అమ్మవారి పేరు చెప్పి బలులు ఇస్తుంటారు. అసలు బాలి అడిగితే, ఆమె అమ్మ ఎలా అవుతుంది? అమ్మ అంటే అర్ధం ఏమిటి? "అమ్మ" అనే పదానికి అర్ధం తెలిసిన వాళ్ళేనా ఈ పని చేసేది. అమ్మ తన పిల్లలైన జంతువుల బలి కోరుతుందా??!!
అమ్మ అలా కోరనే కోరదు. అమ్మ వారి పేరు మీద జరుగుతున్న పూర్తి స్థాయి అజ్ఞానపు రాక్షస చర్య - బలి
మీకు మంచి జరగాలంటే బలులు కాదు ఇవ్వాల్సింది. మీకు మంచి జరగాలని కోరుకుంటూ, ప్రాణాలు తీయకూడదు. ఇది మంచి ఎలా అవుతుంది??!!
మీకు మంచి జరగాలంటే, మంచి చేయాలి. అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, ధన దానం చేయండి లేదా ఇతర సహాయ సహకారాలు చేయండి. అవసరాలు ఉన్నవాళ్ళకు ఈ భూమి మీద కొరత లేనే లేదు. వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళ జీవితాలు నిలబెట్టండి.
మనం ఏం చేస్తే అది మనకు లక్ష రెట్లుగా తిరిగి వస్తుంది. ఒక బలి ఇస్తే, మనం ఎన్నో సార్లు బాలి కావాల్సి వస్తుంది.
శాకాహారం శ్రేష్టం
(- సాక్షి దిన పత్రిక, 22వ పేజి (సందేశం : కె. ఉష శ్రీ గారు, 22 జూలై 2008) సౌజన్యంతో)