Welcome Guest
Register

జంతువుల భాష తెలుస్తుంది-
మనుషులంతా శాకాహారులుగా మారిపోతారు.
- ప్రొఫెసర్‌ డానియెల్‌ పాలీ (బ్రిటిష్‌ కొలంబియా విశ్వ విద్యాలయం)

2056 నాటికీ మనం గ్రహాంతర జీవుల ఉనికిని తెలుసుకోగలం.
అన్ని జంతువుల మనుసులోని భావాల్ని గ్రహించగలం.
మనుషులంతా శాకాహారులుగా మారిపోతారు.
ఏ అవయవాన్నయినా వైద్యులు కృ త్రిమంగా తయారు చేయగలరు.
మానవుడి జీవత కలం 40 శాతం మేర పెరుగుతుంది.

లండన్ : ఎవరో జ్యోతీష్కుడు చక్రం వేసి చెప్పిన విషయాలు కావివి. శాస్త్ర రంగంలో ప్రస్తుత పరిశోధనల్ని విశ్లేషించి, దూరదృష్టితో 40 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు వేసిన అంచనాలివి. న్యూ సైంటిస్ట్ పత్రిక యాభైయేళ్ళ ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా... మరో యాభైయేళ్ళ తర్వత ప్రపంచం ఎలా ఉండబోతుందో వారు ఊహించారు. వాటిలో రెండు విశేషాలివి :

1) జంతువుల మనస్సుల్లో ఉన్న ఆలోచనలను తెలుసుకోగల, వాటి అర్ధాన్ని మన మెదడుకు చేరవేయగల పరికరాలు అందుబాటులోకి వస్తాయి. కోతుల విషయంలో ఇది సాకారమవుతుంది. ఆపై మిగతా క్షీరదాలు, చేపల వంటి వెన్నెముఖ గల అన్ని జీవుల భావాలనూ తెలుసుకునే పరికరాలు వస్తాయి. జంతువుల ఆలోచనలు స్పష్టంగా తెలియడం వళ్ళ వాటిని చంపి తినడం తప్పనే భావన మనుషుల్లో పెరిగిపోతుంది. మానవులంతా శాకాహారులుగా మారిపోతారు.
- ప్రొఫెసర్ డానియల్ పాలీ (బ్రిటిష్ కొలంబియా విశ్వ విద్యాలయం)

2) ప్రస్తుతం గ్రహాంతర జీవుల ఉనికిని కనుగొనేందుకు అవసరమమైన సాధనాల తయారీలో మనం నిమగ్నమై ఉన్నాం. వచ్చే యాభైయేళ్ళలో వాటి ఉనికిని కనుగొనగలం. అంగారకుడిపై ఘనీభవించిన స్థితిలో ఉన్న జీవులను గుర్తించే అవకాశం ఉంది. గురుడికి ఉపగ్రహమైన యురోపా పై కూడా ఇలాంటి జీవులు ఉండవచ్చు. ఆ జీవుల లక్షణాలను అధ్యయనం చేస్తే, మన భూమి పైనే ప్రాణాలతో ఉన్న గ్రహాంతర జీవుల్ని కూడా మనం గుర్తించే వీలుంది.ప్రస్తుతం భూమిపై ఉన్న సూక్ష్మ జీవులన్నీ ఇక్కడివేనా, వేరే గ్రహం నుంచి వచ్చినవా అనేది చెప్పడం సాధ్యం కావడం లేదు. యాభైయేళ్ళలో అది తప్పక సాధ్యపడుతుంది.

- ప్రొఫెసర్ ఫ్రీమన్ డైసన్ (ఇనిస్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ, ప్రిన్స్టన్
క్రిస్ మెక్ కే (నాసా అంతరిక్ష శాస్త్రాల విభాగం)
పాల్ డేవిస్ (ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ)

- ఈనాడు దిన పత్రిక , 22 నవంబర్ 2006 సౌజన్యంతో

ఇస్లాం మతంలో మాంసం
తినాలన్న నిర్బంధమేమి లేదు

ఇస్లాం మతంలో మాంసం తినాలన్న నిర్బంధమేమి లేదు. ఒక ముస్లిం సోదరుడు అడిగిన ప్రశ్నకు మలిక్ గారు ఇచ్చిన సమాధానమే ఇది. సాక్షి దిన పత్రిక (21 జూన్ 2008) సౌజన్యంతో . ఎస్. ఎం. మలిక్ గారు, ఖురాన్ అనువాదకులు , సాక్షి దిన పత్రికలో "ఇస్లాం - సందేహం" అనే శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్న : మాది చాలా సాంప్రదాయ కుటుంబం. ప్రవక్త సూచనలు తూ.చా. తప్పకుండా పాటిస్తాము. నాకు గోమాంసం తినడం ఇష్టం ఉండదు. కానీ మా పెద్దలు ఇది ప్రవక్త ఆజ్ఞ అని ప్రతి ముస్లిం రంజాన్, బక్రీద్ వంటి పర్వ దినాల్లో దీనిని తప్పకుండా తినాలని బలవంతంగా తినిపిస్తారు. నిజంగా ఇది ప్రవక్త ఆజ్ఞేనా?
- జావెద్ పాషా, హైదరాబద్.

జవాబు: ముస్లిములలో పేరుకుపోయిన ఇటువంటి అప నమ్మకాల కారణంగానే ముస్లిమేతర సోదరులలో అనేక అపోహలు, అపార్థాలు చోటు చేసుకున్నాయి. ముస్లిములు గోమాంసం తినాలన్న ప్రవక్త (స) అదేసమేదీ లేదు. రంజాన్‌, బక్రీద్‌ వంటి పండుగల్లో తినాలన్న నిర్బంధం అంతకన్నా లేదు. మీకు ఇష్టం లేకపోతే మీరు జీవితాంతం తినకుండా గడిపే స్వేఛ మీకుంది. నిజానికి గోమాంసమే కాదు. మరే మంసమైన తినాలన్న నిర్బంధమూ లేదు. మీరు శాకాహారిగా (వీగన్‌ గా) ఉంటూ నిజమయిన జీవితం గడిపే అవకాశం ఉంది."