Welcome Guest
Register

చక్కటి ఆరోగ్యం కోసం,
జీవిత కాలాన్ని పెంచుకోవడం కోసం
శాకాహారులుగా(వీగన్‌ లుగా) మారండి !

శాకాహారానికి (వీగనిజమ్‌ కి) సంబంధించిన విశేషమైన, విస్తారమైన, విశ్వసనీయమైన, శాస్త్రీయమైన సమాచారం కావాలంటే దయచేసి ఈ క్రింది వెబ్‌ సైట్లను సందర్శించండి.

  1. www.peta.org
  2. www.islamveg.com
  3. www.goveg.com
  4. www.christianveg.com

" మనం నిత్యం తీసుకునే ఆహారం నుండి "గుడ్డు, మాంసాహారం, పాలు మరియు పాలతో తయారు చేసే అన్ని పదార్థాలు, తేనే మొదలైన జంతువుల నుండి ఉత్పత్తి చేయబడిన(Animal Foods) అన్ని రకాల ఆహారాన్ని" తొలిగించడం ద్వారా ఎన్నో హానికరమైన మరియు విష పూరితమైన పదార్ధాలను తగ్గించుకో గలుగుతాము. అన్ని రకాల క్యాన్సర్లు, గుండెకు సంబంధించిన మరియు రక్త నాళాలకు సంబంధించిన వ్యాధులు, ఇంకా ఇతర ఆరోగ్యాన్ని క్షీణింపచేసే రోగాలను ఎన్నింటినో రాకుండా, ముందు జాగ్రత్తగా, నివారణ చర్యలు తీసుకోవడానికి పెద్దగ శ్రమించనవసరం లేదు. కేవలం శాకాహారులుగా మారడం ద్వారా పైన పెర్కొన్న వ్యాధులు చాల వరకు రాకుండా ముందుగానే నివారించవచ్చు. గుండె జబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్స్, మధుమేహం, ఓస్తోపోరోసిస్, ఊబకాయం, ఇంకా ఇతర వ్యాధులు అన్నీ కూడా మంసాహారానికి, డైరి ఉత్పత్తులకు మరియు జంతువుల నుండి ఉత్పత్తి చేయబడిన అన్ని రకాల ఆహారానికి సంబంధించి ఉన్నాయి."

- డాక్టర్ టి. కోలిన్ క్యాంప్బెల్ - న్యూట్రీషనల్ రీసెర్చెర్, కార్నెల్ యూనివర్సిటి, చరిత్రలో సుదీర్ఘమైన " వ్యాధుల వ్యాప్తి మరియు నివారణ"అనే అంశం పై శాస్త్రీయ మరి వైద్య దృక్పధంతో పరిశోధన చేసే విభాగానికి " డైరెక్టర్"
- www.peta.org వారి సౌజన్యంతో.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) శాకాహారులకంటే మంసాహారులకే ''క్యాన్సర్‌'' వచ్చే అవకాశం అధికంగా ఉందని ఎప్పుడో తెలిపింది. ఏ విధంగా చూసినా పటిష్టమైన ఆరోగ్యానికి శాకాహారమే దారి అని ప్రపంచ ప్రసిద్ధ డాక్టర్లు పరిశోధించి చెప్తున్నారు. శాకాహారంలో ఉన్నన్ని పోషక విలువలు మంసాహారంలోని దేనిలోనూ లేవు. పైగా అది హానికరం, భయంకరం, మాంసాహారం అనేది పూర్తి స్థాయి నెగెటివ్‌ ఆహారం. గుడ్డు, మాంసాహారం బలం అనే భావన ఒక పెద్ద భ్రమ. శాకాహారమే బలవర్ధకమైనది. శాకాహారమే బలం. (ఉదాహరణకు ఏనుగు) ఇతర వివరాల కోసం ఈ కింది పట్టికను చూడండి.

ఆహారానికి ఉపయుక్తమైన, 100 గ్రాములకు ఈ విలువలు తీసుకోబడ్డాయి. ఎనర్జి కిలో క్యాలరీలో తెలుపబడింది.

శాకాహార పట్టిక

పదార్థం ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ మినరల్స్ డయటరీ ఫైబర్ కొవ్వు ఎనర్జీ
పప్పు దినుసులు 9.8 - 28.2 16.9 - 60.9 1.0 - 3.5 8.2 - 28.3 0.5 - 5.6 116- 372
గోధుమ పిండి 12.1 69.4 2.7 12.5 1.7 341
బియ్యం (Milled) 6.8 78.2 0.6 4.1 0.5 345
సోయా బీన్స్ 43.2 20.9 4.6 23.0 19.5 432
కూరగాయలు 0.2 - 27.0 1.4 - 83.1 0.1 - 15.3 1.1 - 16.3 0.1 - 9.6 10 - 364

మాంసాహార పట్టిక

పదార్థం ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ మినరల్స్ డయటరీ ఫైబర్ కొవ్వు ఎనర్జీ
మేక మాంసం 21.4 NIL 1.1 NIL 3.6 118
చికెన్ 25.9 NIL 1.3 NIL 0.6 109
గుడ్డు 13.3 NIL 1.0 NIL 13.3 173
బీఫ్ మాంసపు కండ 22.6 NIL 1.0 NIL 2.6 114
పంది మాంసపు కండ 18.7 NIL 1.0 NIL 4.4 114

పైన తెలిపిన విలువలు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ - NIN (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, హైదరాబాద్) వారి " న్యూట్రీటివ్ వ్యాల్యూ ఆఫ్ ఇండియన్ ఫుడ్స్" (2009 ఎడిషన్) అనే పుస్తకంలో నుండి తీసుకోబడ్డాయి.