Welcome Guest
Register

14) విషాహారాలు మూడు రకాలు అవి : 1. భౌతికం 2. మానసికం ౩. ఆధ్యాత్మికం. ఈ మూడు తలాల్లో మనిషి ఈ విషాహారాలను తక్షణమే శాశ్వతంగా వదిలేసి ప్రాణాహారిగా మారాలి. అందరూ ప్రాణాహారులుగా మారేందుకు పరిశ్రమించాలి. సరి అయినా ఆహారం తీసుకుంటే సరి అయినా శక్తి వస్తుంది. సరి అయిన శక్తి వస్తే మన శరీరం + జీవితం సరిగా ఉంటుంది.

15) శాకాహారిగా(వీగన్‌ గా) ఉండడంలో ఇంకో విషయం కూడా ఉంది. అదేమిటంటే ఇతరులను మానసికంగా వేధించడం కూడా మాంసాహారమే. ఇతరుల ''మెదడు'' తినడం సరి కాదు. జంతువులను తినడం మానేసినప్పుడు ఇతరులను తినడం(వేధించడం) కూడా మానివేయాలి. మన మాటలతో, చేష్టలతో ఇతరులని హింసించడం అనేది కూడా మంసాహారమే. ఇలా చేయటం తక్షణం మానివేయాలి.

16) శాకాహారులుగా (వీగన్‌ లుగా) మారండి. అందరినీ శాకాహారులుగా(వీగన్లుగా) మార్చండి. మీరు అనుభవించాల్సిన కర్మలు ఈ సత్య ప్రచారం ద్వారా సులభంగా వదిలించుకోవచ్చు. మహా గొప్ప మేలు జరుగుతుంది మీకు. మీ జీవితం దివ్యమౌతుంది.

17) శాకాహారులుగా(వీగన్‌ లుగా) ఉండడం అంటే ఆహింసకులుగా ఉండడం, అంటే నిస్వార్ధంగా ఉండడం. ఈ నిస్వార్ధతయే మీ శరీర ఆరోగ్యాన్ని, మీ జీవితంలో ఆనంద ఐశ్వర్యాలను సృష్టిస్తుంది.

18) గుడ్డు మాంసాహారం కాదు అని అంటూ ఉంటారు. వాస్తవానికి గుడ్డు మాంసాహారమే. గుడ్డులో నుండి పుట్టి పెరిగిన కోడి మాంసాహారం అయినప్పుడు మరి కోడి యొక్క ఉత్పత్తి బీజమైన గుడ్డు శాకాహారం ఏలా అవుతుంది?! కోళ్ళ ఉత్పత్తికి కాదని, వీటిని తినవచ్చని చెప్పి కేవలం తినేందుకే కోళ్ళ ఫారాలలో గుడ్లను ఉత్పత్తి చేసి అమ్ముతుంటారు. ఇవి కూడా తినకూడదు.

ఉడక పెట్టిన గుడ్లు, ఆమ్లెట్లు, గుడ్డు కలిపిన కేకులు, ఎగ్ పఫ్ లు ఇంకా ఇతర గుడ్డుకు సంబంధించిన అన్ని పదార్ధాలు కూడా మాంసాహారమే. వీటిని తక్షణమే మానివేయాలి.

19) మాంసాహారం వలన బలం వస్తుందనే అపోహ చాలా మందిలో ఉంది. మాంసాహారం ఏ రకంగా చూసినా బలాన్ని ఇవ్వదు పైగా అనారోగ్యకరం. గమనించి చూడండి, ప్రకృతిలో శాకాహార జంతువులే బలంగా ఉంటాయి. ఉదాహరణకు ఏనుగు.

శాకాహారిగా (వీగన్‌ గా) ఉండడం అంటే యాంత్రికంగా కాదు. ఏదో ఒక శాకాహార కులంలో పుట్టినందువల్ల, యాదృచ్చికంగా శాకాహారిగా (వీగన్‌ గా) ఉండడంతో ప్రయోజనం ఉండదు. మీరు శాకాహారిగా(వీగన్‌ గా) ఎందుకు ఉన్నారో, ఉండాలో మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. అవగాహన కలిగి ఉండాలి. స్మృతి పూర్వకంగా మీరు శాకాహారిగా(వీగన్‌ గా) ఉండాలి. అప్పుడే ప్రయోజనం, అభివృద్ధి.

సంపూర్ణ శాకాహరిగా (వీగన్‌ గా) ఉండడం అంటే ముందు భౌతికంగా తినడం మానివేయాలి. ఆ తర్వాత మానసికంగా మానివేయాలి. మాంసాహారం పట్ల ఉన్న యావను పూర్తిగా తీసేయాలి. టెంప్ట్ కాకూడదు. లొట్టలు వేయకూడదు. మాంసాహారాన్ని తినే వారిని చూస్తూ, వాళ్ళకేం అన్ని తింటారు హాయిగా అని పిసుక్కుని చావద్దు. వాళ్ళు తినేది దరిద్రాలను అని తెలుసుకుని సహజంగా, ఎలాంటి ద్వేషం లేకుండా అవగాహనతో మాంసాహారాన్ని వదలాలి. యాంత్రికత పనికి రాదు. స్మృతి పుర్వకత ఉండాలి.

20) సంపూర్ణ శాకాహారి(వీగన్‌) అంటే ....
భౌతికంగా శాకాహారిగా(వీగన్‌ గా) ఉండాలి.
మానిసికంగా శాకాహారిగా (వీగన్‌ గా) మారలి.
ఆధ్యాత్మికంగా కూడా శాకాహారిగా(వీగన్‌ గా) ఉండాలి.
ఎందుకు శాకాహారిగా (వీగన్‌ గా) ఉండాలో పూర్తి అవగాహన కలిగి ఉండాలి.

అందరిని శాకాహారులుగా(వీగన్‌ లుగా) మార్చేందుకు ప్రయత్నించాలి అయితే ఇబ్బంది పెట్టకుండా, విషయం వివరించి చూడాలి. మారితే మారుతారు లేక పొతే లేదు. కర్మ పండినప్పుడు ఎలాగూ విధిగా మారి తీరుతారు. ఆప్పటి వరకు చాల కష్టాలు పడాల్సి వస్తుంది, నరకయాతన అనుభవించాల్సి వస్తుందని మన ధర్మంగా మనం రక్షించే ప్రయత్నం చేయాలి అంతే ! వింటే వింటారు లేకపోతే విని తీరే పరిస్థితి వస్తుంది. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకుంటే మంచిది. కాలిన తర్వాత ఎలాగూ పట్టుకునే తీరాలి అనుకోండి... అది వేరే విషయం !

21) మిఖైల్‌ నైమీ అనే మాస్టర్‌ శాకాహారం గురించి ఇలా చెప్తాడు - చచ్చిన దానిని తినడం అంటే చావుకి ఆహారం కావడమే. ఇతరులను బాధించి బ్రతకడం అంటే బాధకి ఆహారం కావడమే. వారు చీల్చిన ప్రతి శరీరాన్ని ఎప్పటికైనా తప్పని సరిగా వారి శరీరం తోనే సరిచేయాలని, సరిదిద్దాలని, వారు నాశనం చేసిన ప్రతి ఎముకను వారి ఎముకతోనే మళ్ళీ నిర్మించాలనీ, చిందించిన ప్రతి రక్తపు బొట్టుని వారి రక్తంతోనే తిరిగి నింపాలని సృష్టి నియమం. - మిఖైల్‌ నైమీ

22) నేటి మంసాహరులే రేపటి శాకాహార ప్రచారకులు అవుతారు !

భూమిని, జంతుకోటిని, వాతావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మానవులందరిది.
మానవులు అనబడే ప్రతి ఒక్కరు ఇందుకోసమై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉద్యమించండి. ఉద్యమింప చేయండి.