Welcome Guest
Register

7) భూమి పై ప్రాణులన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. మనిషితో సహా ప్రాణులన్నీ ఒక ప్యాకేజ్ లా ఉంటాయి. అన్నీ తమ ఆత్మాభివృద్ది కోసమే ఈ భూమి పైకి వచ్చాయి. ప్రతీ ఒక్క ప్రాణి మనుగడ మిగతా ప్రాణికోటి అంతటితో ముడిపడి ఉంటింది. ప్రాణికోటిలోని ఏ ప్రాణి అయినా సరే ప్రాముఖ్యం కలదే. ఆత్మ పరిణామ క్రమంలో అన్ని ప్రాణులు తమ తమ కార్యక్రమాలను ప్రకృతి నియమాలకు అనుగుణంగా నిర్వర్తించుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ పరిణామ క్రమం అంతా ఒక చెయిన్ సిస్టం లాగా ఉంటుంది. వీటిలో ఏ ఒక్క ప్రాణిజాతి యొక్క ఆత్మాభివృద్ధి కుంటు పడినా ఆ ప్రభావం మిగతా ప్రాణికోటి మీద పడుతుంది. ఎలా అంటే, శరీరంలో ఏ ఒక్క భాగం దెబ్బతిన్నా మిగితా శరీరమంతా ఆ ప్రభావానికి లోనవుతుంది. మిగతా శరీరమంతా దెబ్బతిన్న భాగానికి శక్తిని, పోషణను అందించవలసి వస్తుంది. ప్రాణికోటిలో మానవుడి దుశ్చర్యల వల్ల ఎంతో జంతుజాలం అనవసరంగా హరించి వేయబడుతుంది. మనిషి చేతుల్లో దారుణ హత్యలకు గురైన జంతుజాలం యొక్క ఆత్మాభివృద్ధి కుంటూ పడుతుంది. దీనితో మొత్తం భూమి పై ఉన్న ప్రాణికోటి అభివృద్ధి అంతా కుంటూ పడుతుంది. మొత్తం భూమి పై ఉన్న సమస్త ప్రాణికోటిలో మానవుడు ఒక్కడే ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తూ ఎంతో వినాశనానికి కారణం అవుతున్నాడు. ప్రకృతికి సంరక్షకుడిగా వ్యవహరించ వలసిన మానవుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. తన మూర్ఖత్వం వలన, అజ్ఞానం వలన ! తన ఆహారం కోసం, తన సరదాల కోసం ఇతర అనవసర సౌకర్యాల కోసం జంతువులను చంపి వాడుకోవడం మానవుడు తక్షణం ఆపివేయాలి ! మనిషి మనిషిగా మారాలి. రూపంలో చూడడానికి మనిషిలాగానే ఉన్నాడు. కానీ అంతరంలో కూడా మనిషి, మనిషి లాగానే ఉండాలి.

8) మాంసాహారం అంటే నెగెటివ్. మాంసాహారం తినటం వలన మనిషిలో నెగెటివ్ గుణాలు పెరుగుతాయి. బలపడతాయి. మరి మన గుణాలే మన వాస్తవాలు. మనం ఎలాంటి గుణాలను కలిగి ఉంటామో మన శరీరం + జీవితం అలాగే ఉంటుంది, నెగెటివ్ గా !

9) మాంసాహారం తినడం వలన శరీర వ్యవస్థ మొద్దుబారుతుంది. ఆత్మ పరిణామ క్రమంలో ఉన్నత స్థాయిని పొందడానికి అవసరమైన ఉన్నత ఆధ్యాత్మిక ప్రకంపనలను స్వీకరించే సూక్ష్మనాడీ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. ఇది మాంసాహారం తినటం వలన మొద్దుబారిపోయి పనిచేయదు. దీని వలన ఆత్మాభివృద్ది ఆగిపోతుంది. ఎంతో నష్టానికి గురి కావాల్సి వస్తుంది.

10) ఒక మనిషిగా మనిషి, మనిషిగానే ఉండాలి, మనిషి మనిషే, మృగం కాదు కదా! ఇతర ప్రాణులపట్ల ప్రేమ, కరుణ, మైత్రి, శాంతి, సహాయ, సమన్వయ భావాలను కలిగి ఉండాలి, ప్రవర్తించాలి. ఇతరులచే ప్రవర్తింప చేయాలి.

11) శరీర పరంగా, రూపంలో మనిషిగా ఉంటె సరిపోదు. ప్రవర్తన కూడా మనిషిగానే ఉండాలి. భావనలో, వాక్కులో, ప్రవర్తన లో.

12) మనిషి భౌతికంగానే కాదు, మానసికంగా కూడా విషాహారాన్ని విసర్జించాలి. అసూయతో కూడిన ఆలోచనలు, కుట్రతో కూడిన ఆలోచనలు, స్వార్థపూరిత ఆలోచనలు, మోసపూరిత ఆలోచనలు, ఇతరులకు హాని చేసే ఆలోచనలు, ఇతరులకు కష్టం, నష్టం, బాధ కలిగించే ఆలోచనలు, దురుద్దేశాలు, దురభిప్రాయాలు, కన్నంగితనం, మానసిక వ్యభిచారం మొదలైనవి అన్నీ ''మానసిక విషాహరాలే''! భౌతికంగా చేయలేని పనులను మానసికంగా చేస్తూ తృప్తి పడుతూ ఉంటారు. ఇది సరికాదు. ప్రవర్తనలోనూ, మానసికంగానూ పరిశుద్ధంగా ఉండాలి. స్వచ్చంగా ఉండాలి. మానసిక స్వచ్చతే మీ శరీరంలో జీవితంలో శాంతిని, ఆరోగ్య ఐశ్వర్యాలను తెస్తుంది. మానసిక పరిశుద్ధత అంటే భావ పరిశుద్ధత అని అర్ధం. భావ(గుణ) పరిశుద్ధతే భవ(పరిస్థితి) పరిశుద్ధత, కాబట్టి మానసికంగా ప్రేమ పూర్వకమైన ఆలోచనలు, నిర్మాణాత్మకమైన ఆలోచనలు, సహాయ సహకార సమన్వయ భరితమైన ఆలోచనలు, శాంతి పూర్వకమైన ఆలోచనలు, అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలను కలిగి ఉండాలి. ఇలాంటి ఆలోచనలే చేయాలి. క్రమం తప్పకుండా సాధన చేస్తే ఈ స్థితిని పొందడం పెద్ద విషయం ఏమి కాదు. ఈ స్థితిని పొందడం శాకాహారులకు(వీగన్‌ లకు) మాత్రమే సాధ్యం.

మనిషి ప్రవర్తనలోనూ, భావంలోనూ శాకాహారిగా(వీగన్‌ గా), ప్రాణాహారిగా ఉండాలి. సరైన ఆలోచనలే ప్రాణాహారం, సరికాని ఆలోచనలే విషాహారం. ఎందుకంటే ఆలోచన అనేది సూక్ష్మమైన ఆహారం, ఆహారం అంటే శక్తి. మరి ఎలాంటి శక్తులను మనం కలిగి ఉంటామో వాటినే మనం అనుభవించాల్సి వస్తుంది.

13) మనిషి కేవలం భౌతికంగా, మానసికంగా ప్రాణాహారిగా మారితే సరిపోదు. ఆధ్యాత్మిక తలంలో కూడా ప్రాణాహారిగా మారాలి. ఆధ్యాత్మికంగా కూడా విషాహారాలు ఉంటాయి. అవి :

  1. 1. మా మార్గమే గొప్పది మిగతావి అన్నీ తప్పు, నీచమైనవి.
  2. 2. మా సంస్థే గొప్పది.
  3. 3. మీ మార్గంలో లేక మీ సంస్థలో లేనందువలన మిగితా వారిని తుచ్చులుగా పరిగణించటం.
  4. 4. మీ సంస్థలో నుండి వెళ్ళిపోయిన వారిని దోషులుగా, నేరస్తులుగా చూడటం.

ఇవి అన్నీ కూడా విషాహారాలే. వీటిని తక్షణమే వర్జించాలి. ఆధ్యాత్మిక విషాహారం గురించి ఓషో ఇలా చెప్తారు.

"ఇక చివరి విషాహారం ఆధ్యాత్మికానికి సంబంధించినది - అదే " ఆత్మ విషం". ఆ ఆత్మకు నిరంతర గమనికే కావాలి. దాన్ని గమనించుకుంటూ ఉంటేనే అది బలపడుతూ ఉంటుంది. నిరంతర ధ్యాసే దాని ఆహారం. అందరూ తమను గమనించి గుర్తించాలనే ఉబలాటం కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే ఉంటుందని అనుకోకండి. ఎంత మంది తమను గుర్తిస్తే అంత మంచిదని రాజకీయ నాయకులు మాత్రమే అనుకుంటూ ఉంటారని అపొహ పడకండి. మీరు గుర్తిస్తున్న పరమహంసలు కూడా దీని కోసమే 'తహ తహ ' లాడుతున్నారు".

"సన్యాసులకు, రాజకీయ నాయకులకూ ఏ భేదమూ లేదు, తేడా కొంచం కూడా లేనే లేదు. అందరి ఆకాంక్ష ఒక్కటే" - ప్రజల గుర్తింపు. "అందరూ నన్నే గమనిస్తూ ఉండాలి. నా ప్రాపునే ఆశ్రయించాలి." అనే ఆలోచనే వాళ్ళందరూ నిరంతరం చేస్తుంటారు - అదే వారి అహంకారానికి ఆహారం అవుతుంది. అదే అత్యంత సూక్ష్మతరమైన ఓ విషాహారం". - ఓషో