Welcome Guest
Register

ఈ విషయాన్ని వివరంగా తెలుసుకోవాలంటే మహా యోగీశ్వరుడైన Peter Richelieu గారు వ్రాసిన " A Soul's Journey" అనే పుస్తకం చదివితే విషయాలు చక్కగా అర్ధం అవుతాయి. ఓషో గారి " స్వస్థత కోసం ధ్యాన చికిత్స - 2" అనే పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి. ఇంకా పరమాత్మ స్వరూపుడైన సేత్ మహాశయుని పుస్తకం " సేత్ విజ్ఞానం Volume-1 మైండ్ పవర్ & ఆత్మ". ఈ మూడు పుస్తకాలు నాలుగైదు వందల్లో వచేస్తాయి. ఈ పుస్తకాలు చదివితే మనకు సంబంధించిన సత్యాలు దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. దయ చేసి చదవండి. ఎంత మంది చేత వీలైతే అంత మంది చేత చదివించండి. ఇతరులకు మీరు ఈ విజ్ఞానాన్ని పంచినప్పుడు మీకు ఎంతో శ్రేయస్కరం జరుగుతుంది. ఈ పుస్తకాలను కొని, మీకు తెలిసిన వారికి కానుకగా ఇవ్వండి, ఇలా చేయడం ద్వారా వారికీ + మీకు ఎంతో మేలు జరుగుతుంది.

౩) ఒక సాటి ప్రాణిని చంపి తినడం అంటే మీకు వాటి ప్రాణాల మీద, వాటి జీవితాల మీద ఏ మాత్రం కనికరం లేదని అర్ధం. ప్రాణం, జీవితం విలువ తెలిసిన వారెవ్వరూ ఈ పని చేయలేరు. నిర్దాక్షిణ్యంగా వాటి ప్రాణాలను, జీవితాలను బలి తీసుకునే మీ క్రూర గుణాలు పూర్తిగా పోనంత వరకు మీ జీవితాలను కూడా బలి చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్రూర గుణాలను మీరు మర్చుకునేంత వరకు మీరు మీ ప్రాణాలను, జీవితాలను బలి చేసుకోవాల్సిందే ! అవి ఎన్ని జన్మలైన పట్టనీ గాక ! ఏ గుణాలతో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఆ ప్రవర్తనల యొక్క ఫలితాలను అవే గుణాలు ఆకర్షిస్తాయి. ఆ ప్రాణులు అనుభవించిన క్షోభ, వ్యధ మీరూ అనుభవించాల్సి ఉంటుంది. మీ గుణాలు మార్చుకుంటే అనుభవించాల్సిన అవసరం ఉండదు. మీ క్రూర గుణాలను మార్పు చెందించేందుకే అనుభవించాల్సి ఉంటుంది. ఇది కేవలం శిక్షణ, శిక్ష కాదు.

4) కూరగాయలు, ఆకు కూరలు మొదలైన శాకాహరానికి (వీగన్‌ ఆహారానికి) సంబంధించిన వాటికి కూడా జీవం ఉంటుంది కదా, అని ప్రశ్నిస్తారు. నిజమే వాటికీ జీవం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక అత్యంత ముఖ్య విషయం ఉంది. సృష్టి అంటేనే జీవం. సృష్టిలో జీవం లేనివి లేనే లేవు. మీ కంటికి ప్రాణం లేని వాటిలా కనిపించే వాటికి కూడా జీవం ఉంటుంది. జీవం లేనివి ఉనికిలో ఉండవు. శాకాహారానికి (వీగన్‌ ఆహారానికి) జీవం ఉంటుంది. మన జీవం నిలపడానికి ఉద్దేశించబడిన దాంట్లో జీవం ఉండకపోతే ఎలా?! జీవాన్ని నిలిపే ఆహారానికి జీవం తప్పని సరిగా ఉండి తీరాలి. ఇదే కారణంగా శాకాహారంలో (వీగన్ ఆహారంలో) జీవం ఉంటుంది. ఆ యొక్క శాకాహారంలో (వీగన్ ఆహారంలో) ఉన్న జీవం మన జీవాన్ని నిలపడానికే ఉద్దేశించబడినది. ప్రకృతి మనకు కేటాయించిన ఆహరం అది. శాకాహారం(వీగన్‌ ఆహారం) తీసుకోవడం సరి. దీనిలో హింస లేదు. రక్తపాతం లేదు. భయానకం లేదు. క్రూరత్వం లేదు. పెనుగులాట లేదు. విల విలా కొట్టుకోవడం అనేది లేదు. వేట లేదు. రాక్షసత్వం లేదు. శాకాహారంలో (వీగన్‌ ఆహారంలో) ఇవన్ని లేవు, ఉండవు, ఉండలేవు కదా, మరి మాంసాహారంలో పైవన్నీ ఉంటాయి. వాటితో కూడిన ఆహరం ఆహరమేనా?!

శాకాహారంలో (వీగన్‌ ఆహారంలో) జీవం లేదా ? మరి వాటిని కోయడం ఎంత వరకు సబబు? అని అడిగే వారు ఒక ప్రాక్టికల్‌ ప్రయోగం చేసి చూడండి. కొన్ని ఆకు కురలు లేదా కూరగాయలు ఎవైనా తీసుకువచ్చి మీ ఇంటి ముందు పెట్టండి. వాటితో అనండి మేం మిమ్మల్ని తినాలని అనుకుంటున్నాం అని, అవి ఏ బదులు ఇవ్వకుండా మౌనంగా, ప్రశాంతంగా ఉంటాయి. అదే మీరు కోడినో, మేకనో తెచ్చి దానిని స్వేచ్చగా వదిలి అడిగి చూడండి. కత్తి చూపెట్టి ప్రశ్నించి చూడండి, ఏం జరుగుతుంది? అవి పారిపోతాయి. అప్పుడు మీరు అంటారు, వాటికీ ప్రాణం ఉంది కదా అందుకే అవి పారిపోతాయి అని అంటారు, వదిలితే పారిపోక పొతే ఎం చేస్తాయి మరి? అని ఎదురు ప్రశ్నిస్తారు... మేము కూడా సరిగ్గా అదే అంటున్నాం, వాటికీ ప్రాణం ఉంది. వాటికీ జీవితం ఉంది. వాటికీ తమ ఇష్టాయిష్టాలను ప్రకటించే సామర్ధ్యం ఉంది. వాటికీ చావాలని లేదు. పైగా అవి మీ ఆహారం కాదు. అవి కేవలం ''మృగాలకు'' మాత్రమే ఆహారం. కానీ మీరు మనుషులు కదా !! జంతువులను కోసేటప్పుడు మీరు దాన్ని హత్య చేస్తున్నారని దానికి తెలుసు, అయినా నిస్సహాయంగా అలా ఉండిపోతుంది. మీరు మత్తు మందు ఇచ్చినా సరే ఆ మత్తు కేవలం ఉపరితలంలో మాత్రమే పని చేస్తుంది. ఓ జంతువును మీరు చంపుతున్నప్పుడు, మరణ భయంతో దాని శరీరంలో అనేకానేక విష రసాయనాలు విడుదల అవుతూ ఉంటాయి. దానికి చావు ఒక్కసారిగా సులభంగా రాదు. మీరు జంతువులను చంపే సమయంలో చావు భయంతో అది అల్లాడి పోతూ ఉంటుంది. మీకు లాగే దానికి కూడా బ్రతకాలని ఉంటుంది. మీరేమో దాన్ని నరుకుతూ ఉంటారు. అది ప్రాణ భయంతో గిల గిలలాడుతూ ఉంటుంది. భయంకరమైన సంఘర్షణను అనుభవిస్తుంది, ఈ సంఘర్షణలో చాల విషాలు విడుదల అవుతాయి, అవి ఆ జంతు శరీరంలో అలాగే ఉండి పోతాయి. మీ చేతిలో హత్యకు గురి అవుతున్న జంతువు కోపంతో, ఆవేశంతో, క్రోధంతో ఉంటుంది. తీవ్ర ఆవేదనను, భాయోద్రేకాలను కలిగి ఉంటుంది. ఆ జంతువు యొక్క మృత్యువు మీ రూపంలో దాని ఎదురుగా నిలబడి ఉంటుంది. దాని పోరాటం అది చేస్తుంది. చివరికి చస్తుంది. అప్పుడు మీరు, ఆ యొక్క మృత కళేబరాన్ని లొట్టలు వేసుకుంటూ తింటారు. మీరు తినేది క్షోభను, వ్యధను, బాధను, శవాన్ని అని తెలుసుకోండి.

5) ఓషో మాంసాహారం గురించి ఇలా చెప్పారు. ''పతంజలిని" విజ్ఞాన శాస్త్రజ్ఞుడని అంటాను. అతడు కవి కాదు. మాంసం తినకూడదని అతడు అంటే మాంసం తినటం హింస అయినందువల్ల అలా చెప్పటం కాదు. మాంసం తినడం ఆత్మహత్య లాంటిది. అహింసకులుగా ఉండటం అంటే నిస్వార్ధంగా ఉండటం అని పతంజలి అంటాడు. అహింసకులుగా ఉండటం వలన ఎవరికో మేలు చేయడం కాదు. నీకు నువ్వే మేలు చేసుకుంటావు. ''మాంస భక్షణ చేయకండి'' అని అతడు చెప్పడం లేదు. హింస అయినందువల్ల అలా చెప్పటం కాదు. మాంస భక్షణ వల్ల ఆత్మ నాశనం కలుగుతుంది కనుక చెబుతున్నాడు. శాకాహారిగా ఉండటంతో నువ్వు మరెవరిపైన దయ తలచడం లేదు. నిన్ను నీవు జాగ్రత్తగా చుచుకోవటం అది'' ! - ఓషో

6 ) మీరు తినే జంతువులన్నీ శాకాహారులే(వీగన్‌ లే). కేవలం మాంసాహారం తినే జంతువులను సాధారణంగా ఎవరూ తినరు.