Welcome Guest
Register

This is a simple, easy and revolutionary method of meditation. It gives miraculous results “instantly”!

1st step of Meditation : Knowing and Understanding

  • My Dear Divine Friends, KNOW and UNDERSTAND the below stated TRUTH.
  • Your " religious elders" and your "religious books” say that you are a SINNER. In fact you are not ! Do not believe in the teachers and their teachings who and which decide you as a SINNER.
  • Do not believe in SIN. There is no sin in this entire creation. The sin you believe in – is a pure delusion !
  • Right now completely delete your feeling – “I am a sinner”.
How ?

Just accept “I am pure !” Heartily believe that … “I am pure !” That’s enough ! With this all your sins will be completely washed away forever. Other than this there is no need to do anything else to become “pure or sacred”.

Sin is nothing but your “guilty consciousness”. Sin is your “guilty memory”, which makes you a “sinner”. Realize that no GOD is making you a “sinner”. It is you - making yourself a “sinner”. “sin” or “guilt” will be removed only when you accept that “ I am pure !” Know and understand - even though you have committed a Zillion sins; you are NOT a sinner. Here I quoted ‘sins’ as per the usage of your “Religious Elders” and your “Religious Books”.

At present you might be a criminal, a killer, a murderer, a dacoit, a thief, a rapist, a sadist, a psycho… or a patient… or an atheist… or at present you might be a good person or a great person – it doesn’t matter ! Your Divinity does not count on these things. Actually in whatever state you are… you are still DIVINE ! It is the TRUTH.

My Dear Lovely Friends,
YOU ARE DIVINE ! YES !!
You forgot it !
Just know and understand this PURE TRUTH that you are GOD !
You are DIVINE !!
Yes ! This is the FINAL TRUTH !
Yes ! This is the only ULTIMATE TRUTH !

Q : How can we regain our Divinity ?
A : The one and only LAW or RULE to regain our Divinity is to “Accept our Divinity” !

Q : When we ourselves are Divine, when we are having Divinity within us, then why should we invite our Divinity ?
A : Yes, we are DIVINE ! But what matters here is that we have forgotten our Divinity. WE HAVE FORGOTTEN OUR DIVINITY WITH OUR FREEWILL so we have to regain it with our FREEWILL. Divinity will not be regained unless and until we invite/accept it. Divinity continuously reminds us of it's presence by giving us messages and inspirations from within in the form of thoughts, feelings and visions. We also get messages and inspirations from our Divinity through “Enlightened Masters” and their teachings.

Q : Why should we meditate ? When we ourselves are Divine/Gods; why are we facing problems ?
A : As we have forgotten our Divinity with our freewill, we are facing problems. To get rid of these problems we have to meditate and regain our Divinity and thus become “free from all problems permanently” !

దైవత్వ అనుభవం , దివ్య నేత్రం "పూర్తిగా, శాశ్వతంగా " ఉత్తేజితం అవడం మరియు కుండలినీ జాగృతం అన్నీ ఒకటే !

మీలో చాలా మందికి ఇలా విడి విడిగా చెబితే కానీ అర్ధం కాదు, అందుకే ఇలా చెబుతున్నాను.

బాగా స్పష్టంగా. బలంగా గుర్తుంచుకోండి - దైవత్వ అనుభవాన్ని, దివ్య నేత్రం ఉత్తేజితమవ్వడాన్ని మరియు కుండలినీ జాగరణను చాలా సరళంగా, సురక్షితంగా తట్టుకుని నిలుపుకోగల పూర్ణ శక్తి సామర్ధ్యాలు మీకు + మీ శరీరానికి సహజంగానే ఉన్నాయి. మీ యొక్క అనవసరమైన భయాలే అవుతున్నాయి. విషయాలను అర్ధం చేసుకుని, మీలోని భయాలకు ప్రేమ + ఎరుకను ప్రకటించండి. అప్పుడు ఆటోమెటిక్ గా మీలోని భయాలన్నీ వాటంతట అవే తొలిగి పోతాయి. అప్పుడు మీరు హాయిగా మీ దైవత్వాన్ని అనుభవ పూర్వకంగా పొందవచ్చు.

మీ దివ్య నేత్రం పూర్తిగా, శాశ్వతంగా ఉత్తేజితం అయి మీ అదుపులో ఉండకపోవడానికి కారణం దాని పట్ల మీకున్న భయం మరియు అపోహలే కారణాలు.

మీ కుండలినీ ఇంకా జాగృతం కాకపోవడానికి గల కారణం దాని పట్ల మీకున్న భయాలే కారణాలు.

మీరు ఇంకా మీ దైవత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోకపోవడానికి గల కారణం - దైవత్వం అంటే మీకు గల భయం. అవును. ఇది నిజం. అందుకే మీరు ఆ అనుభవాన్ని మీలోపల నిరోధిస్తున్నారు.

మీకు ఈ భాయాలున్నాయని మీకే తెలియదు. మీరు గుర్తిస్తే గనుక, మీ భయాలను తలచుకుని వాటికి హృదయపూర్వకంగా "ప్రేమ ఎరుక" లను ప్రకటించండి. మీ భయాలను ఉద్దేశించి....ప్రేమ ఎరుక...ప్రేమ ఎరుక..... అంటూ మీలోపల అనుకోండి. అనుకోవడమంటే ప్రకటించడమే. అప్పుడు మీ భయాలన్నీ తొలిగిపోతాయి.

మీ భయాలను అసహ్యించుకోవద్దు. వాటిని తెలుసుకోండి. వాటిని అర్ధం చేసుకోండి. వాటి పట్ల ప్రేమ ఎరుకలను ప్రకటించండి. అప్పుడు అవి సహజంగా వాటంతట అవే తొలిగి పోతాయి. మీ భయాలన్నీ తోలిగిపోయినప్పుడు మీకు ఎవరో చెప్పాల్సిన అవసరం ఏమీ ఉండదు. మీకే చాల క్లియర్ గా తెలుస్తుంది.

గుర్తుంచుకోండి - నేను దైవాన్ని అని అనుకోవడం అన్నా, దైవత్వాన్ని ఆహ్వానించడమన్నా, దైవత్వాన్ని ఒప్పుకోవడమన్నా, దైవంగా మిమ్మల్ని మీరు భావించుకోవడం అన్నా, దైవత్వ సాధన చేయడం అన్నా, నేనే దైవం అనే ఎరుకను కొనసాగించడం అన్నా...అన్నీ ఒకటే ! ఇవన్ని ఒకటే !!

మిమ్మల్ని మీరు దైవాలుగా ఒప్పుకోవాలి. గాడంగా ఫీలవ్వాలి. నిజంగా అనుభూతి చెందాలి. మీ లోపల వ్యతిరేకతలెన్నో ఉంటాయి. ఆ వ్యతిరేకతల్లో నుండి మిమ్మల్ని మీరు దైవంగా అంగీకరించాలి...అంటే నా లోపల ఉన్న వ్యతిరేకతల్లో నుండి సంపూర్ణంగా నేనే దైవం అని అంగీకరిస్తున్నాను....అని అనుకోవాలి.

మీలో ప్రస్తుతం ఎన్నో వ్యతిరేకతలున్నాయి. అందుకే దైవమే అయి ఉన్న మీరు ఇలా ఉన్నారు. మీరు క్రమం తప్పని సాధన చేస్తూ ఉంటే ఒక నాటికి మీ వ్యతిరేకతలన్నీ క్లియర్ అయిపోయి మీరు దైవం అవుతారు.

వేలాది, లక్షలాది జన్మలుగా మీరు, మీలో "మీ దైవత్వాన్ని" కలిగియే ఉన్నారు. మీరెప్పుడూ మీ దైవత్వాన్ని కోల్పోలేదు. అది అసంభవం. మీరేం చేసినా మీ దైవత్వాన్ని కోల్పోలేరు. ఈ అనంత సృష్టిలోని ఏ శక్తి కూడా మీ నుండి మీ దైవత్వాన్ని దూరం చేయలేదు. మీరు ఒకప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ దైవాలే ! అందరూ దైవాలే ! అంతా దైవమే !

ఇక్కడ దైవం అని అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న, పరమోన్నతమైన, అత్యున్నతమైన, అత్యుత్తమమైన, సర్వోన్నతమైన, సర్వాకార, నిరాకార, నిర్గుణ, సర్వగుణ పరబ్రహ్మను, ఆ ఉనికిని, బ్రహ్మాన్ని, పరమాత్మను, సర్వాత్మను, సర్వస్వంలో సర్వం అయిన సృష్టి సర్వస్వమూ, అనంత సృష్టి కేంద్రమూ అయిన, "అన్ని" మూలాలకు "మూలం" అయిన ఆ యొక్క "మూల చైతన్యం" - "Ultra Consciousness" అని అర్ధం. ఇంకా దానిని ఎన్నెన్నో రకాలుగా అంటూ ఉంటారు. మీరు దానిని మరేమైనా అనండి - నేను ఇక్కడ "దైవం" అని అంటున్నాను.

దైవాలే అయి ఉన్న మీరు ఇంకా మీ దైవత్వాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోలేదని అంటే కారణం ఏమిటని అనుకుంటున్నారు - కేవలం మీరు ఒప్పుకోక పోవడమే అందుకు గల ఏకైక కారణం !

శ్లో II అహంబ్రహ్మేతియోధ్యాయే దేకాగ్రమనసా సకృత్ I
సర్వంతరతి పాప్మానం కల్పకోటిశతై కృతమ్ I
- ఉత్తరగీత 2:41

పరమార్ధం : "నేను దైవాన్ని" అని శ్రద్ధతో ధ్యానం చేస్తే , కోటి కల్పాలలో చేసిన పాపం(కర్మ) మరియు కోటి కల్పాలలో కలిగి ఉన్న పాపం(అజ్ఞానం) అంతా కూడా పూర్తిగా, శాశ్వతంగా, సులభంగా, సరళంగా, నిజంగా తొలిగి పోతుంది.

కృత యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలి యుగాలు నాలుగు కలిపితే ఒక మహా యుగం అవుతుంది. వేయి మహా యుగాలు కలిపితే ఒక కల్పం అవుతుంది.

ఒక మహా యుగం * = 43,20,000 సంవత్సరాలు.
వేయి మహా యుగాలు = ఒక కల్పం.
ఒక కల్పం అంటే... 1000 X 43,20,000 = 4,32,00,00,000 సంIIలు
కోటి కల్పాలు అంటే...
1,00,00,000 X 4,32,00,00,000 = 43,20,00,00,00,00,00,000 సంIIలు

"నేను దైవాన్ని " అని శ్రద్ధతో, విశ్వాసంతో క్షణ కాలం ధ్యానం చేస్తే , 43,20,00,00,00,00,00,000 సంవత్సరాలలో(కోటికల్పాలలో) చేసిన పాపం(కర్మ) మరియు కోటి కల్పాలలో కలిగి ఉన్న పాపం(అజ్ఞానం) అంతా కూడా పూర్తిగా, శాశ్వతంగా, సులభంగా, సరళంగా, నిజంగా తొలిగి పోతుంది అని అంటే ఈ యొక్క "నేను దైవాన్ని" లేక "నేనే దైవం" అనే దైవత్వ సాధన ఎంత శక్తివంతమైనదో గ్రహించండి.

ఒక మహా యుగం యొక్క కాల ప్రమాణం 43,20,000 సంవత్సరాలు - తెలుగు అకాడమి వారి తెలుగు-తెలుగు నిఘంటువు ఆధారంగా చెప్పడమైనది.

ధన్యవాదములు !

M T V