Welcome Guest
Register

NOTE: We do not use past-tenses for Guruji because we don't define Guruji only with his body. He is a Divine Soul and Soul's are eternal. Guruji is eternal.

Sri AmaraGuru Tara Vishal ji is an Enlightened Master. He is a New Age Spiritual Leader and a Super Supreme Master. He counseled and guided many people from the physical, psychological and professional problems and lead them towards success.

He devoted himself to the divine cause “Srushti Kalyanam”, which means “Celebration of Creation”. It can also be referred as Welfare, Prosperity, Well-being, Health and Wealth, Development, Happiness, Joy, Bliss, Ecstasy, Divinity, Harmony of the Creation!

This can be achieved... when people of the World become Spiritually Mature with ‘Divine Understanding’. Sri AmaraGuru Tara Vishal ji intended to accomplish this Divine Mission by Teaching, Training and Spreading Veganism + Meditation + Spiritual Wisdom.

To maximize and accelerate his mission, he started an organization “MISSION TARA VISHAL” with a sole intention of spreading spiritual wisdom. M T V is the official short form of Mission Tara Vishal. M T V is a Registered, Non-Profit, Non-Commercial, Non-Religious, Spiritual and Serviceful Organization. The organization has many members whose intention is to render selfless service. At present this organization is non-functional.

Sri AmaraGuru Tara Vishal ji authored 12 wonderful spiritual books.

Many spiritual awareness programs were conducted and thousands of books have been distributed till date under the guidance of Sri AmaraGuru Tara Vishal ji.

At this point we would like to instruct you about the term “Spirituality”. According to Indian spiritual tradition, a Spiritual Scientist is called “Sadhguru” or “Siddha Guru”. As we talk about “spirituality” people assume it as “religious”. Actually, there is strictly no relation between them; not even a fraction. “Spirituality” is different and “Religion” is different. Like the sky and earth, they are so different from each other. By being called as a “Sadhguru” or a “Siddha Guru”, there is a maximum scope of being marked as a religious person from this point of view Sri AmaraGuru Tara Vishal ji has fashioned the term “Cosmic Scientist” and chose to be called/identified as a “Cosmic Scientist”! Cosmic Science is a study of Cosmos; it can also be referred as Spiritual Science. We can call him as “Sadhguru” or “Guruji”, only if we are not considering it in a religious aspect.

There are number of spiritual organizations around the world, but only few of them offer the true wisdom... It is so unfortunate that every spiritual organization insists that their path or principles or concept is great Sri AmaraGuru Tara Vishal ji offers not only his teachings but also introduces many other spiritual masters and their remarkable works.

Acquiring true wisdom is the ultimate goal !

Wish you all the best !

M T V

గమనిక : మేము గురువుగారి గురించి ప్రస్తావన వచ్చిన్నప్పుడు భూతకాలానికి సంబంధించిన పదాలు వాడము. ఎందుకంటే గురువుగారు కేవలం శరీరం మాత్రమే కాదు. గురువుగారు దివ్యాత్మ, పరమాత్మ... ఆత్మలు అమరం కదా... గురువుగారూ అమరం...

కాస్మిక్ సైన్స్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రం. కాస్మిక్ సైంటిస్ట్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని అర్ధం. కాస్మిక్ సైంటిస్ట్ అంటే తెలుగులో సద్గురువు లేక సిద్ధ గురువు అని అర్ధం. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని స్పిరిచ్యువల్ సైన్స్ అని, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తను స్పిరిచ్యువల్ సైంటిస్ట్ అని అనవచ్చు. అయితే స్పిరిచ్యువల్ అనగానే జనాల్లో మతపరమైనది అనే భావన నెలకొని ఉంది. వాస్తవానికి ఆధ్యాత్మిక శాస్త్రానికి మతానికి ఎలాంటి సంబంధమూ లేదు. అణువంత సంబంధం కూడా లేదు కాక లేనే లేదు. ఆధ్యాత్మికం వేరే మతం వేరే ! ఈ రెండింటికి భూమికీ ఆకాశానికీ ఉన్నంత తేడా ఉంది. సద్గురువు అన్నా లేక సిద్ధ గురువు అన్నా మతపరమైన ముద్ర పడే అవకాశం ఉండడంతో, గురువుగారు కాస్మిక్ సైంటిస్ట్ గా పిలవబడాలని నిర్ణయించుకున్నారు. అయితే మీరు, శ్రీ అమరగురు తారా విశాల్ గారిని, మతపరమైన భావనతో చూడకుండా... ఒక స్వచ్చమైన భావంతో గురూజీ అని గౌరవ సంభోధన చేయాలని అనుకుంటే చేయవచ్చు... కాని... గుర్తుంచుకోండి... మతపరమైన భావన లేకుండా !

వృత్తి : 100% ఉచిత శాకాహార(వీగనిజమ్) + ధ్యాన + ఆధ్యాత్మిక విజ్ఞాన భోధన, శిక్షణ మరియు ప్రచార సేవ ! ఇదే వీరి వృత్తి, ఉద్యోగం మరియు జీవితం కూడా ! 2015 వరకు అన్ని కార్యక్రమాలను పూర్తి ఉచితంగా చేసారు మరియు గురువుగారు తన రచనలను ప్రతిఫలాపేక్ష లేకుండా పూర్తి ఉచితంగా ఇచ్చారు. కానీ జనాలకు ఉచితంగా పంచే కాన్సెప్ట్ అర్ధం కాక, ఉచితంగా వస్తుంది కదా అని వారికి అవసరం లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా తీసుకుని, పాతపేపర్లు కొనే వారికి కిలోల లెక్కన అమ్మేసారు. ఇంకొందరు వారింట్లో పనికిరాని సామాన్లు పెట్టే చోట పడేసారు. ఇవేకాక ఎన్నో అత్యంత బాధాకరమైన పరిస్థితులను ఎదురుకున్నాము. అయినా గురువుగారు 2015 వరకు ఉచితంగానే పంచారు. విత్తనం వేయడం వరకే నా బాధ్యత, అవి మట్టిలో పడ్డయా, రాళ్ళపై పడ్డయా, మొలకెత్తాయా లేదా అనేది సృష్టి బాధ్యత అనేవారు. కానీ 2016 లో మేము ఉచితంగా పంచడం అనేది దివ్యంగా పూర్తి అయింది అని గురువుగారికి ధ్యానంలో వచ్చిన సందేశాలకు అనుగుణంగా, గురువుగారు ఇక ఉచితంగా ఏదీ ఇవ్వకూడదని నిర్ణయించారు.

ఇప్పటి వరకు రచించిన పుస్తకాలు : 12 అత్యద్భుతమైన దివ్య గ్రంథాలు.

ఇప్పటి వరకు 100% ఉచితంగా పంచిన పుస్తకాలు : 21,500+ పుస్తకాలు మరియు కొన్ని లక్షల సాఫ్ట్ కాపీలు.

లక్ష్యం : లోక కల్యాణం. అందరికీ ఆధ్యాత్మిక శాస్త్ర అవగాహన వస్తే ఆటోమెటిక్ గా లోక కల్యాణం జరిగిపోతుంది. కాబట్టే... ప్రపంచమంతా శాకాహార(వీగనిజమ్) + ధ్యాన + ఆధ్యాత్మిక విజ్ఞాన బోధన, శిక్షణ మరియు ప్రచారం.

సంస్థ పేరు & వివరాలు : మిషన్ తారా విశాల్ - M T V

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేయించబడినది. ఇది పూర్తి 100% ఉచిత, సంపూర్ణమైన, సమగ్రమైన, స్వచ్చంద శాకాహార(వీగనిజమ్) + ధ్యాన + ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రచార సేవా సంస్థ. ఎలాంటి వ్యాపార, మత, రాజకీయాలతో సంబంధం లేని పూర్తి స్థాయి స్వచ్చంద సేవ సంస్థ. ఈ సంస్థను స్థాపించింది శ్రీ అమరగురు తారా విశాల్ గారే ! ప్రస్తుతం ఈ సంస్థ మనుగడలో లేదు.

అమరగురు తారా విశాల్ గారు సహజ జ్ఞానోదయం కలిగి ఉన్న ఒక నవీన యుగ ఆధ్యాత్మిక సద్గురువు, జగద్గురువు ! ఒక ఎన్లైటెన్డ్ మాస్టర్ ! ఒక న్యూ ఏజ్ స్పిరిచ్యువల్ మాస్టర్ ! న్యూ ఏజ్ స్పిరిచ్యువల్ లీడర్ ! ఎన్నో లక్షల సంవత్సరాలుగా ఈ భూ మండలం పైన మానవులు కొన్ని సంకట పరిస్థితుల్లో చిక్కుకుని ఉన్నారు. ఈ చిక్కులని విడదీయడానికి ఈ భూ మండలం పైన ఎందరో గ్రాండ్ మాస్టర్స్ అవతరించి తమ బోధనలతో మానవులకు ఏంతో శ్రేయస్కరాన్ని కలిగించారు. ఒక్కో మాస్టర్ ఒక్కో ప్రణాళికతో అవతరించారు, వారి వారి కార్యాలను చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఈ విధంగానే అమరగురు తారా విశాల్ గారు అవతరించారు. వారి "మిషన్" ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు.

ప్రపంచంలో ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలున్నాయి. అయితే వాటిలో సరైన ఆత్మ విజ్ఞానాన్ని అందించేవి కొన్నే ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న చిక్కేమిటంటే, ప్రతీ వారు తమదే గొప్ప అని అనుకుంటారు. తమ కాన్సెప్టే కరెక్ట్ అని అనుకుంటారు. ఇక్కడే వారు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటారు. బావిలోని కప్ప లాగా ! అమరగురు తారా విశాల్ గారు కేవలం తమ బోధనల గురించి మాత్రమే కాకుండా, ఇంకా ఎంతో మంది ఇతర మాస్టర్స్ గురించి ప్రస్తావిస్తారు, పరిచయం చేస్తారు.

ప్రస్తుత కాలానికి మరియు వేలాది సంవత్సరాల భవిష్యత్తు తరాలకు సరిపోయే, పనికివచ్చే, పనిచేసే విజ్ఞానాన్ని + భోధనలను + సాధనలను, వీరు తమ దివ్య గ్రంథాల ద్వారా ప్రజలందరికీ అందించారు. ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానాన్ని ఇన్ని కోణాలలో, ఇన్ని రకాల అవగాహనలతో ఇంతకు ముందు ఎవరూ, ఏ మాస్టర్ కూడా పరిచయం చేయలేదు. గురువుగారు రచించిన గ్రంథాలన్నింటిలో కెల్ల అద్భుతమైన, అపారమైన ఆధ్యాత్మిక గ్రంథ రాజం "సద్గురు తారా విశాల్ మార్గదర్శి". ఇది ఒక ఉద్గ్రంథం, ఒక సద్గ్రంథం. మహోన్నత తాలాల నుండి వచ్చిన సందేశం ప్రకారం ఈ గ్రంథం ఒక "ఆధ్యాత్మిక ప్రళయం" (పాజిటివ్ మ్యనర్ లో ) !

ఇక్కడ మేము చెప్పిన విషయాలే కాకుండా, మేము ప్రత్యక్షంగా ఇంకా ఎన్నెన్నో సత్యాలను తెలుసుకున్నాము. వాటన్నింటినీ బహిరంగంగా తెలియజేసే సమయం వచ్చిన్నప్పుడు తప్పక ప్రకటిస్తాము. మీకు అంతా మంచే జరుగు గాక ! ధన్యవాదాలు ! ఇంత గొప్ప గురు పరమాత్ముని గురించి పరిచయ వాక్యాలు వ్రాయడంతో ధన్యులం అయ్యాము.

కొన్ని ముఖ్య విషయాలను స్పష్టం చేయదలుచుకున్నాం...

... అవి ఏమిటంటే... ఆధ్యాత్మిక గురువు అంటే కాషాయ వస్త్రాలు, బొట్లు, నామాలు... మొదలైనవి ధరించి నిరాడంబరంగా ఉండాలి కదా ! మరి ఈయనేమో టి-షర్టులు, కూలింగ్ గ్లాసెస్ ధరించి ఉంటాడే...!!!???!!! ఆధ్యాత్మిక గురువు ఇలా ఉంటాడా ?! అని కొంత మందికి సందేహం వస్తూ ఉంటుంది. ఇలా సందేహాలు రావడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక గురువులంటే జనాల్లో అలాంటి అభిప్రాయాలున్నాయి మరి ! కాషాయ వస్త్రాలకు, బోట్లకు, నామాలకు, రకరకాల పూసల దండలకు మొదలైన వాటికి ఆధ్యాత్మిక శాస్త్రానికి ఎలాంటి సంబంధమూ లేదు. ఆధ్యాత్మిక గురువు అంటే కాషాయ వస్త్రాలతో, బొట్లతో, నామాలతో, పూసల దండలతో ఉండాలి అని అనుకోవటం కంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదేమో ! ఆధ్యాత్మిక గురువు ఎలాంటి డెకరేషన్ లో ఉన్నాడో కాదు చూడడం... ఆయన ఎలాంటి సబ్జెక్టును కలిగి ఉన్నాడో చూడాలి ! డెకరేషన్లకేం...? ఓ మేకప్ మ్యాన్ ను తెచ్చుకుంటే, రెండు గంటలలో గుండెల్లో గుబులు పుట్టించే గురువు అనిపించేలా తయారు కావచ్చు. మరి అనుభవ పూర్వక ఆత్మ విజ్ఞానం ఉండొద్దూ...?! అసలు గురువు అంటే ఇలా ఉండాలి అని అనుకోవడమే పెద్ద అజ్ఞానం ! ఇలా ఇంకా అనేకానేకమైన తప్పుడు అభిప్రాయాలు జనాలల్లో చాలా చాలా ఉన్నాయి. ఇలాంటి సరికాని అభిప్రాయాలను సరిచేయడానికి ఉద్యుక్తమైన వారిలో అమరగురు తారా విశాల్ గారూ ఒకరు.

తప్పు నీది కాదు, నీ రాత రాసిన దేవుడిదే తప్పు, కాబట్టి నీ రాతను తప్పుగా రాసిన దేవుడికి తన తప్పు దిద్దుకునే అవకాశాన్ని ఇవ్వు. నీలో ఏ దోషము లేదు, ఏ సాధనలు అవసరం లేదు, ఇది కలియుగం కదా... సంకీర్తన లేక దైవనామ స్మరణ చాలు, రోజు మొత్తం లో నీకు వీలైన్నప్పుడు ఒక సారి నీకు నచ్చిన దేవుని పేరు అనుకో చాలు ! ఇక నీ ఇష్టం వచ్చినట్లు నీవు చేయి. అని చెప్పే గురువులంటే కొంత మంది జనాలకు యెంత ఇష్టమో ! ఇలా చెప్పే వారు అడుగులో అడుగు వేసుకుంటూ నిదానంగా నడుస్తారు. నిరంతర చిరునవ్వుతో ఉంటూ ఉంటారు. అందరినీ కూల్ గా చూస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అంటూ ఉంటారు. ఈ బోధనలు చాల హాయిగా, సమ్మగా ఉంటాయి. ఎందుకంటె ఈ బోధనలు... నీ దోషమేమీ లేదు, అంతా నీ రాతదే తప్పు అని చెబుతూ ఉంటాయి ! ఇంకా, ఇది కలియుగం కాబట్టి రోజు మొత్తంలో ఒక సారి భగవంతా... అని అనుకుంటే సరి ! ఏ సాధన అవసరం లేదు అని చెప్తాయి... అందుకే ఇలాంటి బోధనలు చేసే గురువులంటే కొంత మంది జనాలకు ప్రీతీ.

అమరగురు తారా విశాల్ గారేమో నీ వాస్తవాలకు నీవే సృష్టికర్తవు, నీ మంచికీ నీవే కారణం ! నీ చెడుకీ నీవే కారణం ! కలియుగమైనా శాకాహారము(వీగన్ ఆహారము), ధ్యానం మరియు ఆత్మ విజ్ఞాన అభ్యాసం ద్వారానే మోక్షం వస్తుంది, కాబట్టి అనవసరమైన నాటకాలన్నీ మానివేసి సాధన మొదలు పెట్టండి అని ఉన్న సత్యం చెప్పేస్తారు. మరి ఇది కొంచం ఇబ్బంది కదా ! నా లోపాలకు నేనే కారణమా...?! ఈ విషయం జీర్ణం కావడానికి కాస్త అవస్థ తప్పదు కదా ! నిజానికి అవస్థ పడాల్సిన పనే లేదు, ఎరుక తో ఆలోచిస్తే అసలు సిసలు వాస్తవ బోధనలను చాలా ఈజీ గా గుర్తు పట్టవచ్చు, అయితే... ఇలా గుర్తు పడితే... నీ స్వయానికి నీవే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నీ కష్టాలకు నీవే కారణం అనే సత్యాన్ని అంగీకరించాలంటే... చాలా ధైర్యం కావాలి. చాలా గొప్ప అవగాహన కావాలి. ఇక్కడ రాత అంటూ దేవుని మీద నింద వేయడానికి లేదు. అమరగురు తారా విశాల్ గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు... నీ వాస్తావాలకు నీవే కారణమని ! ఈయన అడుగులో అడుగు వేసుకుంటూ. చిరునవ్వుతో అందరినీ ఆశీర్వదిస్తూ , నిరాడంబర వస్త్రాలు ధరించి నిదానంగా. చాలా బ్యాలెన్స్డ్ గా ఆచి తూచి వ్యవహరించే నాటకాలు వేయరు. తమ సహజత్వంతో తాముగా ప్రవర్తిస్తారు.

గురువు యొక్క డెకరేషన్ చూడటం మాని, గురువు యొక్క దక్షతను తెలుసుకుంటే, విశ్వసిస్తే ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది. నిజమయిన గురువుని ఆశ్రయించాలనుకునే శిష్యులకు అనుమానాలు, అవరోధాలు కలుగుతాయి. ఇవన్ని తమ లోపలి లోపాలేనని గ్రహించి, వాటన్నింటిని జయించి వస్తే అప్పుడు వారు మోక్ష పథంలో నడవ గలుగుతారు. సత్య గురువును గుర్తించడం అనేది మీ ఆత్మ పరిణామ క్రమం లో ఒక మహా మహా మహా అభివృద్ధి దశ యొక్క ద్వారాన్ని చేరుకోవడం. గురువుని ఒప్పుకుని ఆయనకు తన్ మన్ ధన్... లతో సంపూర్ణంగా సమగ్రంగా సరెండర్ కావడం అనేది ఆత్మాభివృద్ధి లోకి ప్రవేశం. గురువు వద్ద శాశ్వత రీతిలో స్థిరం కావడం అంటే, మీ దైవత్వాన్ని స్థిరం చేసుకున్నట్టే ! శాశ్వత రీతిలో మీరు అభివృద్ధి పథంలో స్థిరం అయినట్టే ! అందరికీ తక్షణ శాశ్వత గురుస్మృతి ప్రాప్తిరస్తు !

సదా... మీకు మంచి జరుగు గాక !

ధన్యవాదములు !

M T V